OPPO F29 5G : సూపర్ స్పీడ్, సూపర్ కెమెరా– అదరగొట్టే ఫీచర్లుతో..మరింత మెరుగైన పర్ఫార్మెన్స్! 13 d ago

OPPO ఫోన్లు సాధారణంగా మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు OPPO F29 తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. సాధారణంగా శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లు OPPO ఫోన్ల ప్రత్యేకత. ఇప్పుడు కొత్తగా అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ ఫీచర్ ను తీసుకొస్తూ.. వినియోగదారులకు అసాధారణ అనుభవాన్ని అందిస్తుంది. OPPO F29 ని గతేడాది ఆగస్టులో భారత్‌లో లాంఛ్ అయిన 'OPPO F27 5G'కి సక్సెసర్‌గా కంపెనీ తీసుకొస్తుంది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు, డిజైన్, కెమెరా మరియు ఇతర విషయాలు తెలుసుకుందాం రండి!
OPPO F29 5G ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు AMOLED గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120 Hz
పీక్ బ్రైట్‌నెస్: 1200 nits
ప్రాసెసర్: Qualcomm Snapdragon 6 Gen 1
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, ColorOS
బ్యాటరీ: 6500 mAh
ఛార్జింగ్: 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
డ్యూరబిలిటీ: IP66, IP68, IP69 రేటింగ్స్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 2 MP మోనో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP సెల్ఫీ కెమెరా
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
కలర్ ఆప్షన్స్:
- గ్లేసియర్ బ్లూ
- సాలిడ్ పర్పుల్
సెన్సార్లు: ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరో & ప్రాక్సిమిటీ సెన్సార్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G సింగిల్ సిమ్
- Wi-Fi 6E
- బ్లూటూత్ 5.4
- USB టైప్-C
మైనస్ పాయింట్స్:
- సింగిల్ సిమ్
- FM రేడియో లేదు
- 3.5mm ఆడియో జాక్ లేదు
OPPO F29 5G అద్భుతమైన ఫీచర్లతో కూడిన ప్రీమియం మొబైల్. 5G కనెక్టివిటీ, అద్భుతమైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, సన్నని డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. సౌకర్యవంతమైన మొబైల్ అనుభవం కోరుకునే అందరికీ ఈ ఫోన్ మంచి ఎంపిక. ప్రస్తుతం ఈ ఫోన్ సుమారు రూ.25 వేల లోపు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ లో కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ.. వినియోగదారులకి సౌకర్యంగా ఉంటుంది. OPPO F29 ప్రో 5G త్వరలో మీ దగ్గరలోని OPPO స్టోర్లలో మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది.
ఇది చదవండి: Realme P3 Pro అదిరిపోయే ఫీచర్లుతో.. అదరకొట్టే స్మార్ట్‌ఫోన్.!